Madanapalle: నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్సార్‌సీపీ నేత హర్ష!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Madanapalle: నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్సార్‌సీపీ నేత హర్ష!
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో శనివారం నిర్వహించిన పలు వివాహ కార్యక్రమాల్లో వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. బైపాస్ రోడ్డులోని ఆర్. కన్వెన్షన్ హాల్లో అడ్వకేట్ సహదేవ నాయుడు కుమార్తె నారా పల్లవి–మధుసూదన్ వివాహ మహోత్సవ కార్యక్రమంలో హర్ష పాల్గొన్నారు.
అనంతరం పట్టణంలోని ఎస్టేట్‌లో గల పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీదేవి–సోమశేఖర్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో కోటికి శ్రీనివాసులు, రాజు, శివ, కళ్యాణ్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.
Next Story




