thamballapalle: వైఎస్సార్సీపీ యువజన విభాగంలో కిషోర్ కుమార్ రెడ్డికి ఘన సన్మానం

thamballapalle: తంబళ్లపల్లె యూత్ వింగ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి ఎంపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

Srinivasulu, Madanapalle
Published on: 19 May 2026 2:51 PM IST
thamballapalle
X

thamballapalle: వైఎస్సార్సీపీ యువజన విభాగంలో కిషోర్ కుమార్ రెడ్డికి ఘన సన్మానం

తంబళ్లపల్లి: వైయస్సార్ సిపి స్టేట్ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమితులైన కిషోర్ కుమార్ రెడ్డిని నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం ఎంపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. యువతలో పార్టీ బలోపేతానికి కిషోర్ కుమార్ రెడ్డి కృషి చేస్తారని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ పార్టీకి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలు తంబళ్లపల్లి శాసనసభ్యులు, రాజంపేట పార్లమెంట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువతకు అండగా నిలుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పి.టి.ఎం. సింగిల్ విండో మాజీ డైరెక్టర్ జయచంద్రారెడ్డి,వైసీపీ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ వైసీపీ సినియర్ నాయకులు గోపిదిన్నె మల్లికార్జున రెడ్డి,బి. కొత్తకోట కృష్ణారెడ్డి,రాష్ట్ర మేదర సంఘం కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ తాలే సుబ్బు,వైసీపీ యువనాయకులు అశోక్ రాయల్, రాజు, దీపక్, సోము, పూర్ణ, మహి, సందీప్, శివ, హరి, పార్టీ నాయకులు, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొని కిషోర్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story