Jaggampeta: జగ్గంపేటలో 100 మందితో టీడీపీలోకి మాజీ ఎంపీటీసీ!
Jaggampeta: జగ్గంపేటలో వైసీపీకి మైండ్ బ్లాకింగ్ షాక్. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో 100 మందితో టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ సూర్యభవాని.
Jaggampeta: జగ్గంపేటలో 100 మందితో టీడీపీలోకి మాజీ ఎంపీటీసీ!
జగ్గంపేట: అభివృద్ధి చేసే నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అలాంటి నాయకులకు సంపూర్ణ మద్దతు ఇస్తే రాష్ట్రం, నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు.
జగ్గంపేటలో మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ ఆకుల సూర్యభవాని, శ్రీధర్ దంపతులు తమ అనుచరగణం 100 మందితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ జ్యోతుల నవీన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సూర్యభవాని మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ నాయకత్వానికి ఆకర్షితులమై, వారిని బలపరిచేందుకే వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చామని తెలిపారు.
జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో దూసుకుపోతోందని, జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రగతి పరుగులు పెడుతోందని అన్నారు.
జగ్గంపేట టౌన్ ను దత్తత తీసుకుని పెండింగ్ లో ఉన్న సీసీ డ్రైన్లు, సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, 50 లక్షల రూపాయలతో కోనేటి వద్ద ఆధునిక పార్కు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జ్యోతుల నవీన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, పాండ్రంగి రాంబాబు, అడబాల వెంకటేశ్వరరావు, వేములకొండ జోగారావు, ఎస్ఏ గపూర్, పీల మహేష్, సాంబరపు ప్రసాద్, నాండ్ల చిరంజీవి,కోండ్రోతు రాధా పైడియ, చంద్రశేఖర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




