Pithapuram: పిఠాపురం రైతాబ్దానికి సాగునీరు విడుదల పీబీసీ కాల్వల పరిశీలన!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 1000 క్యూసెక్కుల నీటి విడుదల చేపట్టారు.

RAMA KRISHNA, KKD
Published on: 31 July 2026 10:53 AM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం రైతాబ్దానికి సాగునీరు విడుదల పీబీసీ కాల్వల పరిశీలన!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం....పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుమారు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఇవాళ పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (PBC) ఇరిగేషన్ కాలువలను పరిశీలించారు.

అదేవిధంగా, పిఠాపురం రైతులకు సాగునీరు సకాలంలో అందేలా జిల్లా కలెక్టర్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.

పిఠాపురం నియోజకవర్గానికి ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి అండగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story