Peddapuram: పెద్దాపురంలో మహారాణి బుచ్చి సీతాయమ్మ 191వ వర్ధంతి వేడుకలు!

Peddapuram: పెద్దాపురంలో రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ మహారాణి 191వ వర్ధంతి సందర్భంగా మహారాణి సత్రంలో ఎమ్మెల్యే రాజప్ప నివాళులర్పించి అన్నదానం, వస్త్రదానం చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 22 Nov 2026 7:22 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురంలో మహారాణి బుచ్చి సీతాయమ్మ 191వ వర్ధంతి వేడుకలు!

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహారాణి వారి 191 వ వర్ధంతి పురస్కరించుకొని మహారాణి సత్రంలో ప్రజలకు వస్త్ర దానం మరియు అన్నదానం కార్యక్రమం లో ఈవో కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మరియు చైర్మన్ మట్టే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గా పెద్దాపురం నియోజవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప, డి సిబిసి చైర్మన్ అధ్యక్షులు తుమ్మల రామస్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, పెద్దాపురం మునిసిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజులు రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహారాణి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM