Pithapuram: పిఠాపురం పాదగయ క్షేత్రంలో లంకా దినకర్ ప్రత్యేక పూజలు
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని రాష్ట్ర 20 సూత్రాల ఆర్థిక ప్రణాళికల అమలు కమిటీ చైర్‌పర్సన్ లంకా దినకర్ దర్శించుకున్నారు.
Pithapuram: పిఠాపురం పాదగయ క్షేత్రంలో లంకా దినకర్ ప్రత్యేక పూజలు
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం... కుక్కుటేశ్వర స్వామి పాదగయ) క్షేత్రానికి రాష్ట్ర 20 సూత్రాల ప్రోగ్రాం చైర్ పర్సన్ లంకా దినకర్. పిఠాపురం పాదగయ క్షేత్రం లో ఉన్న శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానమునకు రాష్ట్ర 20 సూత్రాల ప్రోగ్రాం ఛైర్పర్సన్ లంకా దినకర్ విచ్చేశారు. వారికి ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు.
అనంతరం శ్రీ దత్తాత్రేయ స్వామి, కుక్కుటేశ్వర స్వామి వారిని, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లను, పురుహూతికా అమ్మవారిని దర్శనం చేసుకుని విశేష పూజలు ఆచరించారు. పూజల అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి శేష వస్త్రాలు, చిత్రపటం అందచేశారు. అనంతరం పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా.ఎన్.శివరామప్రసాద్, తహసీల్దార్ పి. గోపాలకృష్ణ, ఆలయ ఈవో తో ఆలయ అభివృద్ధికి వనరులు, ఇతర విషయములపై సమీక్ష నిర్వహించారు.




