Kakinada: కాకినాడ జిల్లాలో భారీ చోరీ: ఆలయంలో 4 కేజీల వెండి మాయం!
Kakinada: కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టాం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది.
Kakinada: కాకినాడ జిల్లాలో భారీ చోరీ: ఆలయంలో 4 కేజీల వెండి మాయం!
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టాం గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి, స్వామివారికి అలంకరించిన సుమారు 4 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించి ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. చోరీకి పాల్పడే ముందు ఆలయంలోని సీసీ కెమెరాలను కిందికి వంచి, వాటి రికార్డింగ్‌కు సంబంధించిన డీవీఆర్ (DVR) బాక్స్‌ను కూడా తమతో పాటు ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పవిత్రమైన ఆలయంలో జరిగిన ఈ భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది.




