Kakinada: తాళ్లరేవు మండలం రచ్చవారిపేటలో చిన్నారిపై వేధింపుల ఆరోపణ!
Kakinada: తాళ్లరేవు మండలం రచ్చవారిపేటలో ఏడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు. కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మమ్మ, నిందితుడు అదుపులోకి.
Kakinada: తాళ్లరేవు మండలం రచ్చవారిపేటలో చిన్నారిపై వేధింపుల ఆరోపణ!
Kakinada: తాళ్లరేవు మండలం రచ్చవారి పేటలో ఏడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఐదు రోజుల క్రితం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన రచ్చ దాసు (47) చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చిన్నారి అమ్మమ్మ రచ్చ సత్యవేణి కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కోరంగి ఎస్‌ఐ పి. సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




