Razole: రాజోలులో పీవీ రావు జయంతి వేడుకలు.. మాలల జేఏసీకి కొత్త బాస్!
Razole: రాజోలు తాటిపాకలో మాలమహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు 74వ జయంతి వేడుకలు జరిగాయి.
Razole: రాజోలులో పీవీ రావు జయంతి వేడుకలు.. మాలల జేఏసీకి కొత్త బాస్!
రాజోలు: దళిత హక్కుల పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన మహోన్నతుడు స్వర్గీయ పీవీ రావ్ అని రాజోలు మండల మాలల న్యాయపోరాట సమితి నాయకులన్నారు. ఈ మేరకు డాక్టర్..బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం తాటిపాక సెంటర్లో శనివారం మాలమహానడు వ్యవస్థాపకులు స్వర్గీయ పీవీ రావ్ 74 వ జయంతి కార్యక్రమాన్ని రాజోలు మండల మాలల న్యాయపోరాట సమితి జేఏసీ అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత నాలుగు మండలాల జేఏసీల గౌరవాద్యక్షులు బొంతు మణిరాజు, మాలల సీనియర్ నాయకులు రావి విజయ్, గొల్లమందల నాగేంద్ర, చిలకపాటి శ్రీధర్, జేఏసీ ఉపాధ్యక్షులు మందపాటి మధు పీవీ రావ్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ మాట్లాడుతూ.. దళితుల ఐక్యత కోసం, దళిత హక్కుల పరిరక్షణకోసం ఉద్యోగంతో పాటు జీవితాన్నే త్యాగం చేసిన పీవీ రావ్ చిరస్మరణీయుడన్నారు. అంబేడ్కర్, ఫూలే, పీవీ రావ్ ఆశయ సాధనకు దళితులందరూ పునరంకింతం కావాలని బొంతు మణిరాజు పిలుపునిచ్చారు. జేఏసీ అద్యక్ష పదవీ బాధ్యతలను వేరే నాయకులకు అప్పగించాలని మట్టా సురేష్ కుమార్ చెప్పడంతో రాజోలు మండల జేఏసీ ఇంచార్జ్ అధ్యక్షులుగా బొడ్డపల్లి ప్రసాద్ ను నియమిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈకార్యక్రమంలో నీతిపూడి సత్యనారాయణ, పొన్నమాటి భాస్కర్, బుంగ శ్రీనివాస్, కారుపల్లి గోపాలన్, కె ప్రసాద్, బి రవి, జి శ్రీను, ఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




