Pithapuram: పూరీలో ప్రముఖులకు ‘జ్ఞాన ప్రకాష్ నేషనల్ అవార్డు’ల ప్రధానం!
Pithapuram: ఒడిశా పూరీలో జ్ఞాన ప్రకాష్ పత్రిక 10వ వార్షికోత్సవంలో పిఠాపురానికి చెందిన 8 మందికి సేవా, సాంస్కృతిక రంగాల్లో 'నేషనల్ అవార్డు' ప్రధానం చేశారు.
Pithapuram: పూరీలో ప్రముఖులకు ‘జ్ఞాన ప్రకాష్ నేషనల్ అవార్డు’ల ప్రధానం!
కాకినాడ జిల్లా.
పిఠాపురం నియోజకవర్గం.
జ్ఞాన ప్రకాష్ నేషనల్ అవార్డు పూరీలో అందుకున్న పిఠాపురం ప్రముఖులు
పిఠాపురం పట్టణానికి చెందిన ఈ నెల 2వ తేదీన జ్ఞాన ప్రకాష్ పత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన పూరీలో సాంస్కృతిక విశ్వ విద్యాలయంలో జ్ఞాన ప్రకాష్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం భారత దేశంలో సుమారు 20 రాష్ట్రాలనుండి విద్యా, విజ్ఞానం, ఆధ్యాత్మికత మరియు సేవా కార్యక్రమాలు చేస్తున్న వివిధ విభాగాల నుండి సుమారు 300 మంది వ్యక్తులను ఎంపిక చేసి వారికి జ్ఞాన ప్రకాష్ నేషనల్ అవార్డ్ ఇవ్వటం జరిగింది.అందులో ముఖ్యంగా పిఠాపురం నుండి 8 మందిని ఎంపిక చేసి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట నుండి కేవీఎస్ఎస్.ప్రసాద్ సిసిఆర్టి కన్వీనర్ గా ఉండటం వారి ద్వారా పిఠాపురం నుండి మేము 8 మంది ఎంపిక కాబడటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.ప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు.పూరీలో జరిగిన జ్ఞాన ప్రకాష్ నేషనల్ అవార్డ్ కార్యక్రమంలో మేము శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం మరియు మన ఊరు మన బాధ్యత స్వచంద సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవలు గుర్తించి మమ్ములను గుర్తించి మాకు నేషనల్ అవార్డు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా జ్ఞాన ప్రకాష్ పత్రిక వ్యవస్థాపకులు కార్యవర్గం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము అని అన్నారు.ఈ సదర్భంగా కెవిఎస్ఎస్ ప్రసాద్ ( సిసిఆర్టి)ను సభ్యులు సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం కార్యదర్శి కొండేపూడి శంకరరావు, మన ఊరు మన బాధ్యత స్వచంద సేవా సంస్థ కార్యదర్శి అల్లవరపు నగేష్, ఆర్ఎస్ఎస్ కాకినాడ జిల్లా ఇంచార్జి పెమ్మరాజు సత్య రామచంద్రరావు,తెలుగు మాస్టర్ తటవర్తి సుబ్బారావు,ఇంగ్లీష్ మాస్టర్ పైన్డా శ్రీనివాస్,దారు శిల్పి కాగిత నాగేశ్వరావు,చింతపల్లి సింహాద్రి మాస్టర్ మరియు గుడ్ ఫ్రెండ్ ఛారిటీ సభ్యులు మేకా సూర్య ప్రకాష్ పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.




