Amalapuram: బక్రీద్ వేళ జంతు వధపై నిషేధం.. కలెక్టర్ మహేష్ హెచ్చరిక!

Amalapuram: బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆవులు, దూడలు, ఒంటెల వధ చట్టరీత్యా నేరమని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ స్పష్టం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 27 May 2026 8:19 PM IST
Amalapuram
X

Amalapuram: బక్రీద్ వేళ జంతు వధపై నిషేధం.. కలెక్టర్ మహేష్ హెచ్చరిక!

Amalapuram: ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరమని బక్రీద్ సందర్భంగా జంతు వధపై ప్రభుత్వం నిషేధం విధించిందని డాక్టర్..బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు.ఈ మేరకు ఆయన ప్రచార గోడపత్రికను బుధవారం స్థాని కలెక్టరేట్ నందు ఆవిష్కరించి ప్రసంగిస్తూ.. బక్రీద్ సందర్భంగా జంతు వధపై నిషేధం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు.లైసెన్స్ ఉన్న వధశాలల్లో మాత్రమే పశువులను వధించాలన్నారు. పశువైద్యుల దృవీకరణ పొందిన పశువులను మాత్రమే వధించాలన్నారు.

జంతు సంరక్షణ చట్టాలు PCA Act, 1960 మరియు రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. స్థానిక మున్సిపాలిటీ చట్టాలు, FSSAI నిబంధనలు పాటించాలన్నారు.నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆక్రమ వధ లేదా క్రూరత్వం కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలన్నారు.లైసెన్స్ లేని స్థలాలలో లేదా అనుమతి లేని స్థలాలలో పశువులను వధించకూడదన్నారు.చూడి పశువులను, మూడు నెలల లోపు దూడలను మరియు శక్తివంత దృవీకరణ లేని పశువులను వధించకూడదన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎల్ విజయ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story