Amalapuram: ప్లాస్మా టెక్నాలజీతో చెత్తకు చెక్!

Amalapuram: అమలాపురంలో ప్లాస్మా టెక్నాలజీతో వ్యర్థాల నిర్వహణ ప్రారంభం. 1500 డిగ్రీల వేడితో చెత్తను బూడిద చేసే విధానంపై కలెక్టర్ మహేష్ కుమార్ వివరణ.

PRABHU, RAZOLE
Published on: 6 May 2026 5:36 PM IST
Amalapuram
X

Amalapuram: ప్లాస్మా టెక్నాలజీతో చెత్తకు చెక్!

Amalapuram: ప్లాస్మా టెక్నాలజీ ద్వారా తడి మరియు పొడి చెత్తను, హానికరమైన వ్యర్ధాలను బూడిదగా మార్చడం ఆధునిక పర్యావరణహితమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక డంపింగ్ యార్డ్ వద్ద నిర్మించిన ప్లాస్మా టెక్నాలజీతో వ్యర్ధాల నిర్వహణ కొరకు ప్లాస్మా టెక్నాలజీతో ఏర్పాటు చేసిన యూనిట్కు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రైల్ రన్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ​సాధారణంగా పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటాయని, ప్లాస్మా అనేది నాలుగో రూపం అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వాయువును మండించినప్పుడు అది ప్లాస్మాగా మారుతుందన్నారు.

సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ద్వారా హానికరమైన వ్యర్ధాలు మిక్స్డ్ డ్రైవ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసేందుకు వీలుగా రోజువారి 10 మెట్రిక్ టన్నులు ప్రాసెసింగ్ చేసే యూనిట్ను నెలకొల్పడం జరిగిందన్నారు. దీనికి ఎటువంటి గ్యాస్ కరెంటు అవసరం లేదని లోపల మిషనరీ పని చేయడానికి బర్నింగ్ కు మాత్రమే కరెంటు అవసరమన్నారు. బర్నింగు ప్లాస్మాటార్చ్‌ లను ఉపయోగించి దాదాపు ఉష్ణోగ్రతను సృష్టిస్తారన్నారు. బర్నింగ్ చాంబర్ క్లాస్మేట్ టెక్నాలజీ ద్వారా గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ ను లోపలికి పంపిస్తూ 850-1500 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ తో 95% వేస్ట్ బర్నింగ్ అవుతుందని 5శాతం మాత్రమే బూడిద వస్తుందన్నారు.

బూడిద ద్వారా గ్యాస్ వస్తుందని ఫ్లూ గ్యాస్ నాలుగు రకాలుగా ఉంటుందన్నారు. గ్యాస్ దుమ్ము ధూళి 20 మైక్రాన్లు వేస్టును కిందకు నెడుతుందన్నారు. దీనిలో 195 బ్యాగులు ఉంటాయని వీటి ద్వారా 5 శాతం మైక్రాల డస్ట్ కలెక్ట్ అవుతుందన్నారు. నాలుగు దశలలో ప్యూర్ ఎయిర్ బయటకు వస్తుందన్నారు. ఈ ప్లాంట్ నందు 150 కెవిఏ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్లాంట్ అవసరాలకు 120 కె.వి.ఏ కెపాసిటీ సరిపోతుందన్నారు. ఆక్సిజన్ వచ్చి ఈ విపరీతమైన వేడి వల్ల చెత్తలోని అణువులు విచ్ఛిన్నమవుతాయన్నారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ లేదా మెడికల్ వేస్ట్ నేరుగా వాయువులుగా మరియు చిన్నపాటి బూడిదగా మారి పోతుందన్నారు​.

ఈ టెక్నాలజీ వల్ల ​చెత్త కుప్పలు ఉండవనీ పెద్ద ఎత్తున భూమిని ఆక్రమించే డంపింగ్ యార్డ్ ల అవసరం ఉండదన్నారు సాధారణంగా చెత్తను తగలబెడితే విషవాయువులు వస్తాయని కానీ ప్లాస్మా పద్ధతి లో గాలి తక్కువగా ఉండటం వల్ల హానికరమైన పొగరాదన్నారు. తడి, పొడి చెత్తతో పాటు ప్రమాదకరమైన బయో- మెడికల్ వేస్ట్‌ను కూడా ఇది సురక్షితంగా నాశనం చేస్తుందన్నారు. దీనిని నడపడానికి నిపుణులైన సిబ్బంది అవసరమని ​మన దేశంలో కొన్ని ప్రధాన నగరాల్లో మరియు మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టులుగా దీనిని ప్రయోగిస్తున్నారు. చెత్త సమస్యకు ఇది ఒక శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్, తహాసిల్దార్ వి దివాకర్, మున్సిపల్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story