Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ప్రజా సమస్యలు!
Pithapuram: ఉప్పాడ కొత్తపల్లిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలను స్వీకరించి, వాటిని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని జనసేన నేత అక్షయ్ తెలిపారు.
Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ప్రజా సమస్యలు!
పిఠాపురం: నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండల జనసేన పార్టీ మండల కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఇంచార్జ్ రావు అక్షయ్ ఈరోజు పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ, అందిన ప్రతి వినతిపత్రాన్ని పిఠాపురం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి, ఆయా సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story




