Annavaram: అన్నవరం సత్యదేవుని ఆలయంలో కార్తీక మాస ఏర్పాట్లపై విస్తృత స్థాయి సమీక్ష
Annavaram: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో రాబోయే కార్తీక మాసం ఏర్పాట్లపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమన్వయ సమీక్ష నిర్వహించారు.
Annavaram: అన్నవరం సత్యదేవుని ఆలయంలో కార్తీక మాస ఏర్పాట్లపై విస్తృత స్థాయి సమీక్ష
Kakinada: శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో రాబోయే పవిత్ర కార్తీక మాసం సందర్భముగా అన్నవరం క్షేత్రానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా మంగళవారం ఉదయం దేవస్థాన ప్రాంగణంలో సమన్వయ సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి దేవస్థాన ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గారు, కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్ రావు గారు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ ఐ.వి. రోహిత్ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు హాజరయ్యారు.
సమావేశంలో పెద్దాపురం డి.ఎస్.పి తిలక్ గారు, స్థానిక సీఐ సూరి అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీ హరి బాబు , ఎమ్మార్వోలు సూరిబాబు , కాంతారావు పాటు వివిధ శాఖల ప్రతినిధులు ఫిషరీస్, ఇరిగేషన్, వైద్య/ఆరోగ్య శాఖ, అగ్నిమాపక (ఫైర్) శాఖ మరియు గ్రామపంచాయతీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కార్తీక మాసంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, ఉచిత తాగునీరు, మజ్జిగ, అల్పాహార పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు.
తెప్పోత్సవం & గిరిప్రదక్షిణ ప్రత్యేక ఏర్పాట్లు:
పవిత్ర తెప్పోత్సవ కార్యక్రమం సందర్భంగా భద్రతా చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. పంపా నది జలాల్లో ప్రమాదాలు జరగకుండా ఇరిగేషన్ మరియు ఫిషరీస్ అధికారుల సమన్వయంతో గజ ఈతగాళ్లను, బోట్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే గిరిప్రదక్షిణ చేసే భక్తులకు మార్గమధ్యంలో లైటింగ్, మెడికల్ క్యాంపులు, రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని ఎంఆర్‌ఓ మరియు పంచాయతీ అధికారులను కోరారు.
ట్రాఫిక్ & భద్రతా చర్యలు:
కొండపైకి వాహనాల రాకపోకలను నియంత్రించడం, రోడ్డు ప్రమాదాలు జరగకుండా పెద్దాపురం డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు శాఖ ద్వారా ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుంది.
అత్యవసర సేవలు (Emergency Services):
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేలా 24/7 వైద్య బృందాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లను క్షేత్రంలో సిద్ధంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు మాట్లాడుతూ
"స్వామివారి దర్శనానికి వచ్చే ఏ ఒక్క భక్తుడూ ఇబ్బంది పడకూడదు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే సత్య ప్రభ గారు కోరారు.
"భక్తుల సేవయే పరమావధిగా దేవస్థాన యంత్రాంగం పనిచేస్తుంది అని గిరిప్రదక్షిణ, తెప్పోత్సవం, స్వామివారి వ్రతాల నిర్వహణకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని కార్యనిర్వహణాధికారి సూర్యచక్రధర్ రావు గారు తెలియపరిచినారు.




