Kakinada: అన్నవరం: భవానీ భక్తులకు పోలీసుల రేడియం స్టిక్కర్లు
Kakinada: విజయవాడకు పాదయాత్రగా వెళ్తున్న భవానీ భక్తుల బ్యాగులకు అన్నవరం పోలీసులు రేడియం స్టిక్కర్లు అతికించి, ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
Kakinada: అన్నవరం: భవానీ భక్తులకు పోలీసుల రేడియం స్టిక్కర్లు
Kakinada: కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ మరియు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ ఏ బి జి తిలక్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి సూర్య అప్పారావు గారి సూచనలతో అన్నవరం పోలీస్ వారు విజయవాడకు పాదయాత్రగా వెళుతున్న భవాని మాల ధరించిన భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మరియు వారు రోడ్డు పక్కన నడిచేటప్పుడు విజిబిలిటీ కనపడే విధంగా రేడియం స్టిక్కర్లు వారి బ్యాగులకు అతికించడం జరిగినది. దీనివలన పాదయాత్ర గా ప్రధాన రహదారి పై నడుచు వెళ్ళు భక్తులు అదే రోడ్డుమీదుగా వెళ్ళు వాహనాలకు స్పష్టంగా కనబడి ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని ఎస్సై హరిబాబు తెలిపారు.




