Pithapuram: డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశంతో మెగా జాబ్ మేళా..

Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది.

RAMA KRISHNA, KKD
Published on: 6 Jun 2026 5:17 PM IST
Pithapuram
X

Pithapuram: డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశంతో మెగా జాబ్ మేళా..

పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో ఏ యువకుడు,యువతి నిరుద్యోగిగా ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాడా (PADA) అధికారుల నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు.

శనివారం పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన జాబ్ మేళా పాడా పీడీ శివరాం ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ,నేటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్య పూర్తి చేసిన యువత తమ ప్రతిభకు తగిన ఉద్యోగాలు పొందేందుకు ఇటువంటి జాబ్ మేళాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించి, పిఠాపురం నియోజకవర్గాన్ని ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు.యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా స్థానికంగానే అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

అదేవిధంగా ఇంటర్వ్యూకి వచ్చిన ఏ విద్యార్థి ఆకలితో ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేసారు.యువతకు ఉద్యోగం అంటే కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, వారి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి, సమాజ పురోగతికి కూడా అది బాటలు వేస్తుంది అని,అందుకే ప్రతి అర్హత కలిగిన యువకుడు, యువతికి ఉపాధి అవకాశాలు అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అని తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు.

ఈ మెగా జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించగా, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరై తమ ప్రతిభను చాటుకునే అవకాశం పొందారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించి యువతకు అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏపిడి వసంత మాధవి,ఎం పి డి ఓ స్వప్న, పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, పిఠాపురం జనసేన పార్టీ పట్టణ ఇంచార్జ్ డా.చిక్కాల వరలక్ష్మి, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు కంచర్ల భవాని శంకర్,మొగలి అప్పారావు, పిఠాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెల్లుబోయినా ప్రమీల నాగేశ్వరరావు,ఆసుపత్రి డైరెక్టర్ బొజ్జ కుమార్, బొజ్జ లోవరాజు, జోగా వెంకటరమణ, చెల్లు బోయినా సతీష్,తెలగాంశెట్టి వెంకటేశ్వరరావు, మత్స అప్పాజీ, డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, రావుల రమణారావు, వనం వీరబాబు,బొజ్జ రాంప్రసాద్,వేల్పుల చక్రధర్ రావు, గరగా బాబి , వెన్న చందర్రావు, మాధవరపు శ్రీను, వడ్డీ రాజశేఖర్ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story