Pithapuram: హాస్టళ్లలో ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ!

Pithapuram: పిఠాపురంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చింత విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ.

RAMA KRISHNA, KKD
Published on: 11 Aug 2026 7:30 AM IST
Pithapuram
X

Pithapuram: హాస్టళ్లలో ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ!

Pithapuram: కొణిదల పవన్ కళ్యాణ్ నియోజవర్గం పిఠాపురంలో బీసీ, ఎస్టి సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతిగృహం,సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, బీసీ బాయ్స్ హాస్టల్ లను సడన్ విజిట్ చేసిన ఏపీ ఫుడ్ కమిషన చైర్మన్ చింత విజయ్ ప్రతాప్ రెడ్డి ప్రతి హాస్టల్లో విసిట్ చేయడం జరిగింది.

అక్కడున్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతిగృహంలో బాలికలు అందరూ కలిసి శుక్రవారం పెట్టే మెనూలో కిచిడి బదులు ఎగ్ రైస్ పెట్టమని బాలికలు అడగడం జరిగింది.

వారు అడిగిందానికి వెంటనే స్పందించి త్వరలోనే శుక్రవారం ఎగ్ రైస్ ఏర్పాటు చేస్తారని అన్నారు.అనంతరం సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, బీసీ బాయ్స్ హాస్టల్ లను విసిట్ చేసి బాయ్స్ ను టైం కి అని వస్తున్నాయ లేదా అని ప్రతి హాస్టల్లో కిచెన్ చెక్ చేసి ఆహారాన్ని రుచి చూసారు.

ఈ కార్యక్రమంలోసాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతిగృహం హాస్టల్ వార్డెన్ వీ.పద్మ, సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వై. వెంకట్రావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story