Prathipadu: ప్రత్తిపాడులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రజా దర్బార్!

Prathipadu: ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలు స్పాట్‌లోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Aug 2026 12:23 PM IST
Prathipadu
X

Prathipadu: ప్రత్తిపాడులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రజా దర్బార్!

Prathipadu: ఈరోజు గుంటూరు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు నిర్వహించారు.ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణం (హౌసింగ్), పెన్షన్లు, మౌలిక వసతులు కల్పించడం, భూ సంబంధిత సమస్యలు తదితర అంశాలపై ప్రజల వినతిపత్రాలు ఎమ్మెల్యే గారికి సమర్పించారు.

ప్రజలు అందించిన ప్రతి వినతిని ఎమ్మెల్యే గారు క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సాధ్యమైనంత మేర మెజారిటీ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

"ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, ప్రతి కుటుంబానికి న్యాయం చేయడం, ప్రతి సమస్యకు సత్వర పరిష్కారం చూపడం నా బాధ్యత. ప్రజల ఆశయాలే నా కార్యాచరణకు మార్గదర్శకం.

ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నా కృషి నిరంతరం కొనసాగుతుంది" అని ఎమ్మెల్యే గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story