Peddapuram: పెద్దాపురం జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా దివ్య సునీతరాజు
Peddapuram: పెద్దాపురం మండల జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి బుర్ర దివ్య సునీతరాజు శృంగార వల్లభ స్వామి ఆలయంలో పూజలు చేసి, ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభించారు.
Peddapuram: పెద్దాపురం జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా దివ్య సునీతరాజు
పెద్దాపురం: పెద్దాపురం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బుర్ర దివ్య సునీతరాజు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా పెద్దాపురం మండలం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దాపురం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా బుర్ర దివ్య సునీతరాజును బలపరిచినట్లు తెలిపారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్ర దివ్య సునీతరాజుకు ప్రజలు తమ మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




