Tuni: కుండపోత వర్షంలో అదుపుతప్పిన కారు..
Tuni: తుని మండలం ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
Tuni: కుండపోత వర్షంలో అదుపుతప్పిన కారు..
తుని: తుని మండలం ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్న కారు, ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం.
ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో రహదారిపై వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.
అయితే, కారు బోల్తా పడినప్పటికీ, అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story




