Pithapuram: పిఠాపురంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక క్షేత్రస్థాయి పర్యటన!

Pithapuram: పిఠాపురంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించి, మౌలిక వసతులు, ముంపు సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

RAMA KRISHNA, KKD
Published on: 30 Sept 2026 6:46 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక క్షేత్రస్థాయి పర్యటన!

Pithapuram: పిఠాపురం కాలనీ లలో మౌలిక వసతుల కల్పన కు, ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.. పాడా పీడీ డాక్టర్ ఎన్.వీ. శివరాం రప్రసాద్, మున్సిపల్ అధికారులతో కలిసి పిఠాపురం లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

తొలుత పిఠాపురం పాద గయ దగ్గరలో సామర్ల కోట కు వెళ్లే రహదారి పక్కన ఉన్న బ్రాహ్మణ కాలనీలో పర్యటించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి,కాలనీ వాసులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా కాలనీలో తాగునీరుకు పైపులైన్, సీసీ రోడ్డు, మురికి కాలువ, ట్రాన్స్ఫార్మర్ సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు.. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం పిఠాపురం మండలం పి. రాయ వరంలోని స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ, తడి-పొడి చెత్త సేకరణ,తాగునీరు ట్యాంకులకు క్లోరినేషన్, మురికి కాలువలకు పూడిక తీత,ప్రభుత్వ సేవలు వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ తనిఖీ చేసి వివరాలు ఆరా తీశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయిలో తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బందికి సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. పి.రాయవరం, గొల్లప్రోలు మండలం ఏ.కే.మల్లవరం గ్రామాలలో ముంపు బారిన పడిన పంట పొలాలను పరిశీలించి.... అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ముంపుకు గురికావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. పంట పొలాలు ముంపునకు గురికాకుండా రైతులకు శాశ్వత పరిష్కారాలు చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. భవిష్యత్తు లో ముంపు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

చివరిగా పిఠాపురం పాడా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురం పర్యటన సందర్భంగా అందిన వినతుల పరిష్కార పురోగతిని సమీక్షించారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పాడా అదనపు పీడీ వసంత మాధవి, మున్సిపల్ కమిషనర్ ఎస్.టీ.వీ.రాజేశ్వరరావు, ఎంపీడీవో కృష్ణవేణి, ఏడీఏ స్వాతి; గోల్లప్రోలు తహసీల్దార్లు, ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD