Tuni: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కొండ ప్రాంతంలో జల్లెడ పడతాం!

Tuni: తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబానికి కలెక్టర్ హరిందిరప్రసాద్ భరోసా ఇచ్చారు. కొండపై ముమ్మర గాలింపునకు ఆదేశాలు.

MANIKANTA, TUNI
Published on: 9 July 2026 2:56 PM IST
Tuni
X

Tuni: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కొండ ప్రాంతంలో జల్లెడ పడతాం!

Tuni: తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ఉధృతం చేస్తామని జిల్లా కలెక్టర్ హరిందిరప్రసాద్ ప్రకటించారు. గురువారం బాధితురాలి నివాసానికి చేరుకున్న కలెక్టర్, చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, "జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పటికే చేపట్టిన గాలింపు చర్యలను కొనసాగిస్తూ, త్వరలోనే ఇంటి వెనక ఉన్న కొండ ప్రాంతంలో మరో దఫా విస్తృతమైన గాలింపు చేపడతాం. ఈ ప్రాంతంపై క్షుణ్ణంగా అవగాహన ఉన్న స్థానికుల సహాయంతో కొండపై ప్రతి అంగుళాన్ని జల్లెడ పడతాం" అని వెల్లడించారు.

​గాలింపు ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన కలెక్టర్, వారికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు.

​పాప ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తున్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పోలీసులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story