Tallarevu: భక్తులకు గుడ్ న్యూస్.. కార్పొరేట్ స్థాయిలో పుష్కర ఘాట్ల నిర్మాణం!

Tallarevu: 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తాళ్లరేవు, కాజులూరు ఘాట్లను పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 May 2026 2:35 PM IST
Tallarevu
X

Tallarevu: భక్తులకు గుడ్ న్యూస్.. కార్పొరేట్ స్థాయిలో పుష్కర ఘాట్ల నిర్మాణం!

తాళ్లరేవు: గోవలంక పుష్కర ఘాట్ల పనులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధీర ప్రసాద్ పరిశీలించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో తాళ్లరేవు, కాజులూరు మండలాల్లోని ప్రధాన ఘాట్లను ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నదిపై ఉన్న ప్రధాన పుష్కర ఘాట్ల వద్ద చేపట్టాల్సిన మరమ్మత్తులు, కొత్త ఘాట్ల నిర్మాణంపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించినట్లు తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం, రవాణా వంటి అన్ని మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన ఘాట్లను పరిశీలిస్తున్నామని, రాబోయే రోజుల్లో మైనర్ ఘాట్లను కూడా తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story