Samalkot: బురదమయంగా మారిన కెనాల్ రోడ్డు.. పట్టించుకోని అధికారులు!

Samalkot: సామర్లకోట-కాకినాడ కెనాల్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. వర్షపు నీరు, బురదతో తరచూ ప్రమాదాలు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.

Durgarao, Staff Reporter -Kakinada
Published on: 11 Jun 2026 4:58 PM IST
Samalkot
X

Samalkot: బురదమయంగా మారిన కెనాల్ రోడ్డు.. పట్టించుకోని అధికారులు!

Samalkot: సామర్లకోట-కాకినాడ కెనాల్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. వర్షం కురిసిన సమయంలో నీరు రోడ్డుపై నిలిచిపోవడం బురదమయంగా మారడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షపు నీరు కెనాల్ లోకి వెళ్లే మార్గం మట్టితో మూసుకుపోవడంతో రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోతుందని పలువురు పేర్కొంటున్నారు.

రోడ్డు నిర్వహణను R&B అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బురద నీరు చేరడంతో ప్రయాణం ప్రమాదభరితంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఇక్కడే ఒక కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిందని గుర్తు చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారిని బాగు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Durgarao, Staff Reporter -Kakinada

Durgarao, Staff Reporter -Kakinada

మీడియా రంగంలో 5 ఏళ్ల నమ్మకమైన ప్రయాణం. విశ్వసనీయమైన వార్తలు, వేగవంతమైన అప్‌డేట్స్‌తో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story