samarlakota: 'సంక్షేమ విజయాలు' కార్యక్రమం నిర్వహించిన డిసిసిబి చైర్మన్!

samarlakota: సామర్లకోటలో కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాల కార్యక్రమం నిర్వహించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 30 July 2026 12:35 PM IST
samarlakota
X

samarlakota: 'సంక్షేమ విజయాలు' కార్యక్రమం నిర్వహించిన డిసిసిబి చైర్మన్!

samarlakota: గత వైసిపి ప్రభుత్వం లో వలంటరీ వ్యవస్థ చేసిన పొరపాట్లతో ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందడం లేదని డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. గురువారం సామర్లకోట పట్టణ పరిధి 4, 5,6 వార్డులలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమాలకి సంబంధించి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం హయంలో వలంటరీలు నిరుపేదలకు సైతం నాలుగైదు మీటర్లు ఉన్నట్లు నమోదు చేయడంతో వారికి ఇప్పటికీ సంక్షేమ పథకాలైన పెన్షన్లు,ఇళ్ల స్థలాలు,తల్లికి వందనం వంటి పథకాలు అందడం లేదని తమని ప్రశ్నిస్తున్నారని బాబు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందని, విద్యుత్ మీటర్లకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో నడిపించడం జరుగుతుందని, ఓటమి ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమ భవిష్యత్తుకు భరోసా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా బాబు పేర్కొన్నారు.పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైన్లు వంటి పనులు చేపట్టి ప్రారంభించడం జరిగిందన్నారు.

అనంతరం డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ లు 4,5,6 వార్డులలో కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వార్డులో సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకునీ త్వరితగతిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బడుగు శ్రీకాంత్, సరోజ వాసు, కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్,బలుసు వాసు,పిట్ట జానకి రామారావు, అందుగులు మణికుమారి జార్జి చక్రవర్తి, తాతపూడి కృష్ణ బాబు,వల్లూరి దొరబాబు,దాట్ల శ్రీనివాస్,ముత్యం రాజబాబు,నిమ్మకాయల కిరణ్,తుమ్మల ప్రసాద్, గోల్తి సత్యనారాయణ,నూతలపాటి సత్తిబాబు,అత్తిలి కృష్ణ,కాళ్ళ రవీంద్ర,జల్లి సుధాకర్,పితాని సూర్యనారాయణ,మడగల శ్యామ్, బొందల రామలక్ష్మి, పిల్లాడి సత్యవతి,పడాల వీరబాబు,తదితర కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story