Kakinada: కాకినాడ గేట్‌వే పోర్టు పేరు మార్పు యనమల లేఖ

Kakinada: కాకినాడ గేట్‌వే పోర్టును 'కోన గేట్‌వే పోర్టు'గా మార్చాలని సీఎం చంద్రబాబుకు యనమల లేఖ. భూములు త్యాగం చేసిన రైతుల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Durgarao, Staff Reporter -Kakinada
Published on: 14 July 2026 7:19 PM IST
Kakinada
X

Kakinada: కాకినాడ గేట్‌వే పోర్టు పేరు మార్పు యనమల లేఖ

కాకినాడ: కాకినాడ గేట్‌వే పోర్ట్ పేరు మార్పు కాకినాడ గేట్‌వే పోర్ట్ పేరును *'కోన గేట్‌వే పోర్ట్'*గా మార్చాలని సీఎం చంద్రబాబుకు యనమల లేఖ రాశారు. కేఎస్‌ఈజెడ్ (KSEZ) ప్రాజెక్టు కోసం కోన ప్రాంత రైతులు 10 వేల ఎకరాల భూములను వదులుకున్నారు. వారి త్యాగానికి గుర్తింపుగా ఈ పేరు మార్పు సముచితమని ఆయన అభిప్రాయపడ్డారు.

పోర్టుకు స్థానిక ప్రాంతం పేరు పెట్టడం వల్ల కోన ప్రాంత ప్రజల్లో యాజమాన్య భావన పెరుగుతుందని, ఇది రైతులకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్టు. 'కాకినాడ గేట్‌వే పోర్ట్' పేర్లు ఒకేలా ఉండటం వల్ల వాణిజ్యపరంగా, పరిపాలనాపరంగా గందరగోళం ఏర్పడుతోంది. పేరు మార్చడం ద్వారా కాకినాడ డీప్ వాటర్ పోర్టుతో ఉన్న స్పష్టత పెరుగుతుందని, సాంకేతిక సమస్యలు ఉండవని తెలిపారు. కోన ప్రాంత ప్రజల మనోభావాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ విప్ యనమల దివ్య హామీ ఇచ్చారు.

Durgarao, Staff Reporter -Kakinada

Durgarao, Staff Reporter -Kakinada

మీడియా రంగంలో 5 ఏళ్ల నమ్మకమైన ప్రయాణం. విశ్వసనీయమైన వార్తలు, వేగవంతమైన అప్‌డేట్స్‌తో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story