Kakinada: సామర్లకోట స్కూళ్లలో డీఈఓ రమేష్ ఆకస్మిక తనిఖీ!

Kakinada: కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ బుధవారం సామర్లకోట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 15 July 2026 11:51 PM IST
Kakinada
X

Kakinada: సామర్లకోట స్కూళ్లలో డీఈఓ రమేష్ ఆకస్మిక తనిఖీ!

కాకినాడ: కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ సామర్లకోట మండలంలోని పలు పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సామర్లకోట అర్బన్ లోని యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసారు.

ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల రీడింగ్ అండ్ రైటింగ్ ఎబిలిటీని పరిశీలించారు. అలాగే ఇంగ్లీషు లోని పదములకు అర్దాలు తెలుసుకోవాలని విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు రానున్న పబ్లిక్ పరీక్షల నిమిత్తం మోటివేషన్ చేపట్టి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.

అనంతరం పాఠశాల సిబ్బందితో డిఇఓ సమావేశమై విద్యార్థుల ప్రగతిని గురించి పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మిషన్ ఎస్సెస్సి 2026 ప్రకారం పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఈవో వెంట ఎంఈఓ పి పుల్లయ్య, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శేష సాయి, సూర్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story