Pithapuram: పిఠాపురంలో దస్తావేజు లేఖర్ల నిరసన.. రిజిస్ట్రేషన్లు బంద్!

Pithapuram: జీవో 396ను రద్దు చేయాలని పిఠాపురంలో దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన. సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం. రూ.10 లక్షల మేర నిలిచిన లావాదేవీలు.

V. Ramakrishna, Pithapuram
Published on: 7 July 2026 7:01 AM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో దస్తావేజు లేఖర్ల నిరసన.. రిజిస్ట్రేషన్లు బంద్!

పిఠాపురం: పిఠాపురం పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం మరియు దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దస్తావేజు లేఖర్లు అందరూ కలిసి నల్ల బ్యాచ్లు ధరించి రిజిస్టర్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.ముందుగా సబ్ రిజిస్టర్ కు తమ నిరసన చేస్తున్నామని తెలుపుతూ వినతి పత్రాన్ని అందించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం మరియు దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం పిఠాపురం పట్టణ ప్రెసిడెంట్ యాదల పాపారావు మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దు అని, రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటు పరం చేయవద్దు అలా చేస్తే లేఖర్ల కుటుంబాలన్నీ రోడ్డుని పడతాయని మాకు ఈ వృత్తి తప్ప వేరే ఒక వృత్తి తెలియదని సుమారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 20వేల కుటుంబాలు ఉన్నాయని మాపై దయవుంచి

ఆ దస్తావేజు లేఖర్లు లైసెన్సులు పునరుద్దరించాలి అని,396 జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు.అనంతరం మరి కొంతమంది లేఖర్లు మాట్లాడుతూ లేఖర్లు, స్టాంపు వెండర్ల,డి.టి.పి. ఆపరేటర్ల ఉపాధిని కాపాడండి లేదంటే కొన్ని వేల మందికి ఉపాధి కోల్పోతారని ఈ ఒక్కరోజే పిఠాపురం పట్టణంలో రిజిస్ట్రేషన్ ఆపివేయడం వల్ల సుమారు పది లక్షల లావాదేవీలు నష్టం ఏర్పడిందని దీనిపై సరైన స్పందన రాకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఇవాళ రేపు ఈ నిరసన కొనసాగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం పట్టణ ప్రెసిడెంట్ యాదల పాపారావు,వైస్ ప్రెసిడెంట్ అవసరాల వెంకట రామారావు,కేదార్ శెట్టి వెంకట మల్లేశ్వరరావు,భగవాన్,గంగాద్రి, వెన్న బాబ్జి,జై కృష్ణ దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story