Peddapuram: డీఎస్పీ ఏబీజే తిలక్ ఆధ్వర్యంలో మరిడమ్మ జాతర భద్రతా సమీక్ష!

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ జాతర మహోత్సవాల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 11 July 2026 11:04 PM IST
Peddapuram
X

Peddapuram: డీఎస్పీ ఏబీజే తిలక్ ఆధ్వర్యంలో మరిడమ్మ జాతర భద్రతా సమీక్ష!

పెద్దాపురం: ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించనున్న మరిడమ్మ జాతర మహోత్సవాల ఏర్పాట్లపై పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆలయ అధికారులు,జాతర కమిటీ సభ్యులు హాజరయ్యారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు,ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ,పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై డీఎస్పీ తిలక్

చర్చించారు.జాతర విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కమిటీ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐ వైఆర్కె శ్రీనివాస్,ఎస్సై పాపారావు పాల్గొని జాతర ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని,సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story