Tondangi: బోటు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించండి ప్రభుత్వ విప్

Tondangi: కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎల్లయ్యపేట సముద్రతీరంలో చేపల వేట బోటులో అగ్నిప్రమాదం జరిగింది.

MANIKANTA, TUNI
Published on: 9 July 2026 9:39 PM IST
Tondangi
X

Tondangi: బోటు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించండి ప్రభుత్వ విప్

తొండంగి: మండలం, ఎల్లయ్యపేట సముద్రతీరంలో చేపల వేట బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు జాలర్లు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య, వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

​ఆమె ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మరియు కోడా వెంకట రమణ హుటాహుటిన కాకినాడలోని ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

​అనంతరం, అక్కడకు చేరుకున్న మత్స్యశాఖ అధికారులతో మాట్లాడిన యనమల రాజేష్, ప్రమాద బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story