Tuni: లోవ తలంపులమ్మ ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తనిఖీలు!

Tuni: లోవ తలంపులమ్మ దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ కె.రామచంద్రమోహన్.

MANIKANTA, TUNI
Published on: 20 July 2026 1:55 PM IST
Tuni
X

Tuni: లోవ తలంపులమ్మ ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తనిఖీలు!

Tuni: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలంపులమ్మ అమ్మవారి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమీషనర్ శ్రీ కె. రామచంద్రమోహన్ గారు సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేసిన కమీషనర్, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆలయ ఉప కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఆధ్వర్యంలో అమ్మవారి సేవలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సమీక్షించారు.

​భక్తులతో నేరుగా అభిప్రాయ సేకరణ:

ఆలయ దర్శనానికి విచ్చేసే భక్తుల నుంచి సేకరించిన ఫోన్ నంబర్ల ద్వారా, కమీషనర్ గారు స్వయంగా ఒక భక్తునితో ఫోన్లో మాట్లాడారు. ఆలయంలోని వివిధ విభాగాలలో అందుతున్న సేవలపై ఆ భక్తుని అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్వహణ మరియు భక్తులకు అందుతున్న సేవలపై సదరు భక్తుడు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story