Kakinada: బీజేవైఎం కాకినాడ జిల్లా జీఎస్గా లచ్చబాబు నియామకం
Kakinada: కాకినాడ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన ఏనుగుల లచ్చబాబు నియామకం.
Kakinada: బీజేవైఎం కాకినాడ జిల్లా జీఎస్గా లచ్చబాబు నియామకం
Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన యువ నాయకుడు ఏనుగుల లచ్చబాబు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి (జీఎస్)గా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు లచ్చబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్రను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజాసేవలో మరింత చురుకుగా వ్యవహరించి, తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి.
Next Story




