Annavaram: సత్యదేవుని సేవలో డిజిటల్ క్రియేటర్లు

Annavaram: రత్నగిరి సత్యదేవుని దివ్య వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు అన్నవరం దేవస్థానం సరికొత్త అడుగు వేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Jun 2026 8:58 PM IST
Annavaram
X

Annavaram: సత్యదేవుని సేవలో డిజిటల్ క్రియేటర్లు

Annavaram: అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి (ఈవో) గారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు మరియు భక్తి ప్రచారకులు హాజరయ్యారు. మొత్తం 180 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవస్థానం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాల గురించి అవగాహన పొందారు.

ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి గారు దేవస్థానం చేపడుతున్న భక్తుల సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, పరిశుభ్రత, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు మరియు శ్రీ స్వామివారి వైభవాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయవలసిన అవసరాన్ని వివరించారు.

అలాగే, దేవస్థానం నిర్వహిస్తున్న కార్యక్రమాలను బాధ్యతాయుతంగా, సానుకూల దృక్పథంతో ప్రజలకు చేరవేయడంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేసి దేవస్థానం అభివృద్ధికి సహకరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశం విజయవంతంగా నిర్వహించబడగా, పాల్గొన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేయబడినవి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story