Tuni: జ్యోతిష్యుడి పేరుతో వ్యక్తి హల్చల్.. కుటుంబ సభ్యుల ఆందోళన

Tuni: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.

MANIKANTA, TUNI
Published on: 18 Jun 2026 10:29 AM IST
Tuni
X

Tuni: జ్యోతిష్యుడి పేరుతో వ్యక్తి హల్చల్.. కుటుంబ సభ్యుల ఆందోళన

తుని: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో విస్తుపోయే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చిన్నారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి ‘జ్యోతిష్యుడిని’ అని చెప్పుకుంటూ వచ్చి స్థానికంగా గందరగోళం సృష్టిస్తున్నాడు.

తానొక జ్యోతిష్యుడినని పేర్కొన్న సదరు వ్యక్తి, చిన్నారి ఇంటికి చేరుకుని అనవసరపు వ్యాఖ్యలతో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేస్తున్నాడు. "జ్ఞానేశ్వరి రాత్రి ఒంటి గంటలోపు తిరిగి వస్తుంది, లేకపోతే రాదు" అని మొదట జోస్యం చెప్పాడు.

అయితే, పాప తిరిగి రాకపోవడంతో ఆ వ్యక్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, చిన్నారి ఇంటి పై అంతస్తులోనే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం "పాప భూదేవతల్లో కలిసిపోయింది.. ఇక చనిపోయింది" అంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, ఆ పేరుతో రాత్రి పూట పూజలు, జ్ఞానం చేయాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నాడు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story