Kakinada: సామాజిక చైతన్య గీతాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి కన్నబాబు!
Kakinada: ళంగి గ్రామానికి చెందిన రచయిత సవిలే రాజేష్ రచించి, ఆలపించిన సామాజిక గీతాన్ని మాజీ మంత్రి కురసాల కన్నబాబు శుక్రవారం ఆవిష్కరించారు.
Kakinada: సామాజిక చైతన్య గీతాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి కన్నబాబు!
కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం వేళంగి గ్రామానికి చెందిన రచయిత సవిలే రాజేష్ రచించి, స్వయంగా ఆలపించిన "కులం కుళ్లు నింపుకున్న – ఓ మానవుడా, నీవెన్ని పూజలు చేసి – ఫలితమేమిరా" అనే సామాజిక చైతన్య గీతాన్ని శుక్రవారం కాకినాడలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు తన స్వగృహంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, రచయిత సవిలే రాజేష్ పుస్తక రచనతో పాటు సమాజ సేవలోనూ చురుకుగా పాల్గొంటున్న వ్యక్తి అని కొనియాడారు. రాజేష్ రచించి ఆలపించిన ఈ గీతం "సాటి మనిషిని ప్రేమించడమే నిజమైన భక్తి" అనే గొప్ప మానవతా సందేశాన్ని ప్రజలకు అందిస్తోందని అన్నారు. సమాజంలో కుల, మత భేదాలకు అతీతంగా మానవత్వాన్ని చాటిచెప్పే ఈ తరహా సృజనాత్మక రచనలు మరింత వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సవిలే రాజేష్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లైఫ్ లైన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కోరుకొండ భానుమతి, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అధికారి సాంబత్తుల వెంకట్రావు, బౌద్ధ వివాహకర్త ఉపాసక గిడ్ల వీర ప్రసాద్, బిషప్ మేడపాటి రాజ్ కుమార్, అడ్వకేట్ యడ్ల కుటుంబరావు, కనికెళ్ల రాజాబాబు, ఫణి కుమార్, చిన్నం వెంకటేశ్వరరావు, దాలిపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొని రచయిత సవిలే రాజేష్‌ను అభినందించారు.




