Gandepalli: తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పనుల్లో తీవ్ర జాప్యం
Gandepalli: గండేపల్లి మండలం తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం పనుల జాప్యంపై పాఠంశెట్టి సూర్యచంద్ర ఆవేదన. ఆగస్టు 15 గడిచినా సాగునీరు అందక రైతుల ఎదురుచూపులు.
Gandepalli: తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పనుల్లో తీవ్ర జాప్యం
గండేపల్లి: గండేపల్లి మండలం తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం పునరుద్ధరణతో సాగునీటి కష్టాలు తీరుతాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోందని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాఠం శెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పుష్కర పంప్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పడుతున్న పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల సమస్యలపై పోరాటాలు చేశారని , అధికారంలోకి వచ్చిన వెంటనే పుష్కర పథకాన్ని పునరుద్ధరించి సాగునీరు అందిస్తామని హామీలు ఇచ్చారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకానికి రూ.52 కోట్ల పరిపాలనా అనుమతి లభించిందని, 2025 డిసెంబర్‌లో ఒప్పంద ప్రక్రియ పూర్తయిందని సూర్య చంద్ర తెలిపారు . 2026 ఫిబ్రవరి 6 నుంచి పనులు ప్రారంభించాల్సి ఉండగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో శంకుస్థాపన అనుమతుల కోసం ఆయన చుట్టూ తిరిగి కాలయాపన చేశారన్నారు.
ఇరిగేషన్ పనులు శంకుస్థాపనలు నిర్వహించడానికి ఇరిగేషన్ మంత్రితో చెయ్యాలే తప్ప విద్యాశాఖ మంత్రితో కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలయాపనతో వేసవికాలంలో జరగవలసిన పనులు వర్షాకాలంలో నిర్వహించడం బాధాకరమన్నారు. పాత పైపులైన్లను తొలగించి కొత్త ఎంఎస్ పైపులైన్ ఏర్పాటు చేయడంతో పాటు మోటార్ల మరమ్మతులు చేపట్టడం ఆలస్యం అవుతుందని
“ఆగస్టు 15న నీళ్లు ఇస్తాం”.. అని చెప్పి నెరవేరని హామీ రైతులకు చెప్పడంతో నమ్మి రైతుల వ్యవసాయ సాగు ప్రారంభించారన్నారు.
పనులు పూర్తయిన వెంటనే సాగునీరు అందిస్తామని హామీలు వరుసగా వస్తున్నప్పటికీ, గడువులు మాత్రం మారుతున్నాయని సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం వ్యక్తం. జూన్ 20న నీరు అందిస్తామని చెప్పారని, ఆ గడువు దాటిన తర్వాత ఆగస్టు 15 నాటికి తప్పనిసరిగా నీరు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
జూలై 20న పంప్‌హౌస్ వద్ద రైతులతో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగస్టు 15న నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో, జగ్గంపేట నియోజకవర్గంలోని పుష్కర ఆయకట్టు రైతులు 32 వేల ఎకరాల అయకట్టు రైతులు ఆ తేదీ కోసం ఎదురుచూశారని పేర్కొన్నారు. అయితే ఆగస్టు 15 గడిచిపోయినా సాగునీరు అందకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
గడువులు మారుతున్నాయే తప్ప.. నీరు రావడం లేదు!
నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం, సంబంధిత ప్రజాప్రతినిధులపై ఉందని సూర్యచంద్ర తెలిపారు . ఇప్పటికే పంటల సాగు సమయం దాటిపోతుండటంతో మరింత ఆలస్యం జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. “హామీలు కాదు.. పొలాలకు నీళ్లు కావాలి” అని స్పష్టం చేస్తున్నారు.
పుష్కర ఆయకట్టు 32 వేల ఎకరాల కు పట్ట నష్టపరిహారంగా ఎకరాకు 20000 చొప్పున ఇచ్చే విధంగా అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గలంపాలని కోరారు. లేనియెడల రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని అప్పులు ఊపులో పడి ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు అది సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




