Kakinada: తుఫాను ప్రభావం కాకినాడలో గణేష్ నిమజ్జన వేళల్లో మార్పులు!

Kakinada: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో గణేష్ నిమజ్జన వేళల్లో మార్పులు. చీకటి పడేలోపే నిమజ్జనాలు పూర్తి చేయాలని ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశం.

MANIKANTA, TUNI
Published on: 23 Sept 2026 8:59 AM IST
Kakinada
X

Kakinada: తుఫాను ప్రభావం కాకినాడలో గణేష్ నిమజ్జన వేళల్లో మార్పులు!

Kakinada: ​తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, కాకినాడ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాల వేళల్లో మార్పులు చేశారు. ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, రానున్న రెండు రోజుల పాటు నిమజ్జన కార్యక్రమాలను సాయంత్రం చీకటి పడేలోపే పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

​వాతావరణ పరిస్థితులు మారుతున్నందున ఉత్సవ కమిటీలు మరియు మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ జారీ చేసిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు యంత్రాంగానికి ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI