Kothapalli: అటకెక్కిన పారిశుధ్యం.. చిన్న వర్షానికే రోడ్లపైకి డ్రైనేజీ నీరు!
Kothapalli: కాకినాడ జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది.
Kothapalli: అటకెక్కిన పారిశుధ్యం.. చిన్న వర్షానికే రోడ్లపైకి డ్రైనేజీ నీరు!
Kothapalli: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో పంచాయతీ అధికారుల అలసత్వం స్పష్టంగా కనబడుతుంది.గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుధ్యం ఆటకెక్కినట్లు కనబడుతుంది. గ్రామంలో ఎటువైపు చూసిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.
గ్రామంలో కొన్నిచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఆదివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికే నీరు రోడ్ల మీదకు వచ్చి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ చెత్త కుప్పలకు తోడు డ్రైనేజీ నీరు కలవడంతో గ్రామంలో చిలకల కోనేరు వద్ద పరిస్థితి అధ్వానంగా తయారయింది.
దీంతో ప్రజలు రోగాల బారిన పడతామని భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కొత్తపల్లి గ్రామంలో పారిశుద్యాన్ని మెరుగుపరిచి, గ్రామస్తులను రోగాల బారి నుండి రక్షించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.




