Razole: ఇది మంచి ప్రభుత్వం.. రాజోలులో అమూల్య పర్యటన

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

PRABHU, RAZOLE
Published on: 1 May 2026 2:03 PM IST
Razole
X

Razole: ఇది మంచి ప్రభుత్వం.. రాజోలులో అమూల్య పర్యటన

రాజోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ఈరోజు రాజోలు నియోజకవర్గం వివిధ గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయం సిబ్బందితో కలిసి అంతర్వేదికర, అంతర్వేది రామ్ బాగ్, అంతర్వేది దేవస్థానం తదితర గ్రామాలలో రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య పెన్షన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ.. ఇది మంచి ప్రభుత్వం అని, ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ,జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తదితర ప్రభుత్వ పెద్దలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలపాలని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని వారి అడుగుజాడల్లో కూటమి నాయకులు అందరం కూడా పనిచేయాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవాలని మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాన భూమిక పోషించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు మెంబర్ హాజీ ముకర్రం హుస్సేన్, మండల పార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, పోతురాజు కృష్ణ, పప్పుల లక్ష్మీ సరస్వతి రమేష్, చెల్లుబోయిన జయ సూరిబాబు, నాగబాబు, చెల్లింగి లీలా శ్రీనివాస్, కడలి వెంకటరత్నం, పోతాబత్తుల శ్రీనివాస్, అంతర్వేదిపాలెం పెద్దిరాజు, తాడి నీలకంఠం, పంగం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story