Gollaprolu: సెల్ టవర్ నిర్మాణంపై నిరసన.. పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి!

Gollaprolu: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నివాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు నిరసన.

V. Ramakrishna, Pithapuram
Published on: 31 Aug 2026 6:19 PM IST
Gollaprolu
X

Gollaprolu: సెల్ టవర్ నిర్మాణంపై నిరసన.. పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి!

Gollaprolu: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని ఈబిసి కాలనీ మరియు దేవినగర్ ప్రాంతాలలో నివాసాల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ స్థానిక ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యను తెరపాలన్నారు.

నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఇండస్ కంపెనీ వారు ఈ సెల్ టవర్‌ను నిర్మిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ టవర్ నిర్మాణం వల్ల వెలువడే రేడియేషన్ కారణంగా భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా ఈ రేడియేషన్ ప్రభావం వల్ల వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, మరియు చంటిపిల్లలు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు (ఆరోగ్య సమస్యలకు) గురయ్యే ప్రమాదం ఉందనిపేర్కొన్నారు.అంతేకాకుండా, రేడియేషన్ ప్రభావం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

50 మీటర్లలో ప్రభుత్వ స్కూలు 10 మీటర్లు ఎలక్ట్రికల్ హై టెన్షన్ పోల్స్ ఉన్నాయి అని,జనసాంద్రత కలిగిన ఈ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని స్థానిక కాలనీ వాసులు కోరుతున్నారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏబీసీ కాలనీ మరియు దేవినగర్ కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story