Kakinada: గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు!

Kakinada: కాకినాడ గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పిఠాపురం పోలీసుల రాత్రి వేళ ప్రత్యేక వాహన తనిఖీలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు, డ్రైవర్లకు సేఫ్టీ అవగాహన.

RAMA KRISHNA, KKD
Published on: 24 Aug 2026 8:36 AM IST
Kakinada
X

Kakinada: గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు!

Kakinada: కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు 23-08-2026 రాత్రి 23:00 గంటల నుండి 24-08-2026 తెల్లవారుజామున 03:00 గంటల వరకు పిఠాపురం సర్కిల్ పరిధిలోని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గల టోల్ ప్లాజా వద్ద నైట్ బీట్ మరియు నైట్ ఎస్‌ఐ సిబ్బందితో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని బ్రీత్ అనలైజర్ ద్వారా తనిఖీ చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతోంది. న్యాయస్థానం ద్వారా జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుంది.

అదేవిధంగా, రాత్రివేళ ప్రయాణించే డ్రైవర్లకు “Stop, Wash & Go” కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. నిద్రమత్తులో వాహనాలు నడపకుండా తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని సూచించారు.

మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని పోలీసులు సూచించారు.

“మద్యం సేవించి వాహనం నడపవద్దు – ప్రాణాలను కాపాడండి”

“నిద్రమత్తులో డ్రైవింగ్ వద్దు – సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి”

ప్రజలందరూ బాధ్యతాయుతమైన వాహనదారులుగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story