Gollaprolu: పోలవరం కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం

Gollaprolu: గొల్లప్రోలు మండలం కొడవలి సమీపంలోని పోలవరం కాలువలో గుర్తుతెలియని పురుషుడి శవం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 29 Aug 2026 9:07 PM IST
Gollaprolu
X

Gollaprolu: పోలవరం కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం

గొల్లప్రోలు: గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామం శివారు ఇందిసమ్మ గుడి సమీపంలో పోలవరం కాలవనందు సుమారు 30 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని పురుషుడి శవం పోలవరం కాలువ నీటిలో బోర్ల పడి ఉండగా కొడవలి గ్రామ వి ఆర్ ఓ పద్మశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు పై కొడవలి గ్రామ పంచాయతీ శానిటరీ సిబ్బంది

సహకారంతో గొల్లప్రోలు పోలీసు గుర్తుతెలియ శవంను నీటిలో నుండి బయటకు తీయించి తదుపరిచర్య నిమిత్తం శవంను అంబులెన్స్ లో పిఠాపురం గవర్నమెంట్ హాస్పటల్ కు శవపరీక్ష నిమిత్తము పంపడం అయినది. సదరు యొక్క సంఘాటనపై గొల్లప్రోలు ఎస్ ఐ . రామకృష్ణ కేసు నమోదు చేసి మృతుని వివరాలు గురించి దర్యాప్తు చేయుచున్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story