Prathipadu: ప్రత్తిపాడులో ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు పేదలకు సాయం!
Prathipadu: ప్రత్తిపాడులో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు. 10 పేద కుటుంబాలకు రూ.లక్ష విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన జనసేన నాయకుడు గోపిశెట్టి శ్రీను.
Prathipadu: ప్రత్తిపాడులో ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు పేదలకు సాయం!
Prathipadu: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్తిపాడు గ్రామంలో పేద కుటుంబాలకు చేయూత అందించారు.జనసేన నాయకుడు గోపిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో తన సొంత నిధులతో 10 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారుఒక్కో కుటుంబానికి సుమారు రూ.10 వేల విలువైన నిత్యావసర సరుకులను అందించారు.పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గోపిశెట్టి శ్రీను తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మోర్తా వీరబాబు,బొబ్బర ప్రసాద్,తేజోమూర్తుల పవన్ కుమార్ తదితర జన సైనికులతో పాటు బీజేపీ నాయకుడు వెలుగూరి హరే రామ్,ముప్పన బోయిన ఏసుబాబు,మరియదాసు తదితరులు పాల్గొన్నారు.




