Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో వైభవంగా గందోత్సవ వేడుకలు!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కత్తులగూడెం దర్గాలో 41వ గందోత్సవాన్ని కులమతాల అతీతంగా అత్యంత వైభవంగా నిర్వహించారు.

V. Ramakrishna, Pithapuram
Updated on: 23 Sept 2026 6:33 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో వైభవంగా గందోత్సవ వేడుకలు!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం కత్తులగూడెంలో గల హజరత్ మహబూబ్ సుభాని దర్గాలో హజరత్ మహబూబ్ సుభాని ఝండా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా గందోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా హజరత్ మహబూబ్ సుభాని ఝండా కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు మాట్లాడుతూ గత 41 సంవత్సరాలుగా హిందూ ముస్లిం అనే తేడ లేకుండా అందరం కలిసికట్టుగా ఈ గందోత్సవాన్ని నిర్వహిస్తామని దీనికి సహకరిస్తున్న మా ముస్లిం సోదరులకు మా కమిటీ సభ్యులకు కత్తులగూడెం యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, అలాగే ఈ గందోత్సవం సందర్భంగా పిఠాపురం పురవీధుల్లో తిరుగుతూ ప్రసాదం వితరణ చేస్తామని, సాయంత్రం దర్గా వద్ద ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని దీనికి సుమారు 4000 మంది భక్తులు విచ్చేసి కులమత భేదం లేకుండా సేవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో హజరత్ మహబూబ్ సుభాని కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram