Pithapuram: పిఠాపురంలో అంబరాన్నంటిన సంబరాలు.. ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

Pithapuram: పిఠాపురంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సంబరాలు.

V. Ramakrishna, Pithapuram
Published on: 20 April 2026 1:24 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో అంబరాన్నంటిన సంబరాలు.. ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

Pithapuram: పిఠాపురం పట్టణం టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో టిడిపి నాయకులు కార్యకర్తల మధ్య ఆనంద కోలహాలతో అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ వి ఎస్ ఎన్ వర్మ మాట్లాడుతూ హైదరాబాద్ అని ప్రపంచ పటంలో నెంబర్ వన్ గా చూపించింది చంద్రబాబు అని అలాగే ఆంధ్రప్రదేశ్ ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించగల సత్తా ఉన్న వ్యక్తి ఆయనని, అలాంటి వ్యక్తి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని శ్రీ ఉమాకుక్కుటేశ్వర పురోహితిక అమ్మవారు దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయ ని ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని టిడిపి నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం పిఠాపురం నియోజవర్గం శాసనసభ్యులు& ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శాస్త్ర చికిత్స అనంతరం కోల్పోవడం జరుగుతుందని మరల ప్రజల్లోకి సేవ చేస్తూ ఆయన ముందుకు సాగుతారని దేవుడు మంచు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story