Pithapuram: పిఠాపురం విశ్వ విజ్ఞాన పీఠంలో 29న గురు పౌర్ణమి మహాసభ
Pithapuram: పిఠాపురం పీఠంలో ఈనెల 29న గురు పౌర్ణమి మహాసభ జరగనుంది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Pithapuram: పిఠాపురం విశ్వ విజ్ఞాన పీఠంలో 29న గురు పౌర్ణమి మహాసభ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం....
శ్రీ విశ్వ విజ్ఞాన పీఠంలో 29న గురు పౌర్ణమి మహాసభ.
విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో (పిఠాపురం)ఈనెల 29న గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా వారి ఆధ్వర్యంలో మహాసభ జరుగుతోందని పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటల నుండి 12:30 గంటల వరకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపి అయినా పీఠాధిపతులు స్వామివారి దివ్య పాదాలకు గులాబీ రేఖలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుందని, సుమారు 5000 మంది సభ్యులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వివరించారు .
వచ్చిన వారందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారి ఆశీస్సులను పొందవలసిందిగా ఆయన కోరారు.




