East Godavari: చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తల్లిదండ్రుల కన్నీటి వేదన!
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 62 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించలేదు.
East Godavari: చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తల్లిదండ్రుల కన్నీటి వేదన!
East Godavari: 62 రోజులుగా వీడని జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ.. కంటతడి పెట్టిస్తున్న తల్లిదండ్రుల వేదన.
తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఉదంతం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. చిన్నారి అదృశ్యమై 62 రోజులు గడుస్తున్నా, వందల గంటల పాటు గాలించినా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఎటు చూసినా కన్నీళ్లే మిగులుతుండగా.. ఇప్పటికీ ఆ పసిపాప గాలిలో దీపంలా ఎక్కడ ఉందోనని తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం.
జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఇప్పటికీ ఒక్క గుడిని వదలలేదు, తిరగని చోటు లేదు. రోజూ ఒకచోట కాదు, నిత్యం దేవుళ్లను వేడుకుంటూనే ఉన్నారు. నేడు లక్షవరం బాబా గుడికి జ్ఞానేశ్వరి తల్లి భవాని వెళ్తున్న పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తండ్రి గణేష్ వివిధ ఏజెన్సీ ప్రాంతాలు, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం వంటి పలు ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నారు. అక్కడ మకాంలో ఉంటున్న స్థానికులను, వీధుల్లోనివారందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు.
ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగి విస్తృతంగా సెర్చ్ చేసినప్పటికీ ఎలాంటి క్లూ దొరకలేదు. వాళ్ళు కూడా వెనుతిరిగారు. ప్రస్తుతం చుట్టుపక్కల గాలింపు చర్యలు దాదాపుగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పైన అడవుల్లో మాత్రం అప్పుడప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు వీరికి ఫోన్లు చేసి వివరాలు ఆరా తీస్తూనే ఉన్నారు.
62 రోజులు గడుస్తున్నా పసిపాప ఆచూకీ దొరకకపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ మిస్టరీ వెనుక అసలు నిజాలు నిగ్గు తేలాలని, పాప త్వరగా క్షేమంగా తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు




