Kakinada: తుఫాన్ బీభత్సం - రోడ్లపై కూలిన చెట్లు, తొలగింపు!

Kakinada: జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో భారీ వర్షాలకు రోడ్లపై విరిగిపడిన చెట్లు. ఎంపీడీవోల ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు - నిండిన చెరువులు, కుంటలు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 24 Sept 2026 1:14 PM IST
Kakinada
X

Kakinada: తుఫాన్ బీభత్సం - రోడ్లపై కూలిన చెట్లు, తొలగింపు!

Kakinada: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీj వర్షాలకు జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో చెట్లు విరిగి రహదారికి అడ్డంగా పడ్డాయి. దాంతో జగ్గంపేట ఎంపీడీవో చంద్రశేఖర్, గండేపల్లి ఎంపీడీవో హరికృష్ణ సత్యారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను తొలగిస్తున్నారు.

జగ్గంపేట మండలం జగ్గంపేట టు కాకినాడ రహదారిపై విరిగిపడ్డ చెట్టును ఎంపీడీవో చంద్రశేఖర్ పర్యవేక్షణలో అధికారులు తొలగించారు. మండలంలో ఉన్న చెరువులు, కుంటలు భారీ వర్షానికి నిండుకున్నట్లు తెలియజేశారు.

అలాగే గండేపల్లి ఎంపీడీవో హరికృష్ణ సత్య రెడ్డి పర్యవేక్షణలో పి , సూరంపాలెం గ్రామంలో రోడ్డుకు అడ్డుగా పడ్డ చెట్టు తొలగించగా మండల పరిధి రామయ్య పాలెం గ్రామంలో చెట్టు విరిగి విద్యుత్ స్తంభం భయపడడంతో స్తంభం ఒరిగింది. దాంతో విద్యుత్ శాఖ అధికారులు వేణు వెంటనే చెట్టు తొలగించి విద్యుత్ పునర్దిస్తున్నారు. ఆయా మండలాలలో మండల, గ్రామస్థాయి అధికారులు పరివేక్షణ నిర్వహిస్తున్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA