Gokavaram: గోకవరంలో ప్రకృతి బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షం!

Gokavaram: గోకవరం మండలంలో వీచిన ఈదురు గాలులకు వెంకటాపురం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది.

NARAYANA, RAJANAGARAM
Published on: 18 Jun 2026 7:56 AM IST
Gokavaram
X

Gokavaram: గోకవరంలో ప్రకృతి బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షం!

Gokavaram: గోకవరంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అతి వేగంగా గాలులు వేయడంతో ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకొరిగాయి.

గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామపంచాయతీ పరిధి వెంకటాపురం గ్రామ శివారులో ఈ ఈదురు గాలులకు భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది.దీంతో గోకవరం నుండి రంపచోడవరం వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఆ వృక్షాలను తొలగించేందుకు ఆలస్యం కావడంతో ప్రయాణికులు వాహనాల నుండి దిగి కాలినడకన వెళ్లడం జరిగింది.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story