Tuni: తుని నేషనల్ హైవేపై NHAI అధికారుల యాక్షన్ ప్లాన్!

Tuni: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్‌ఎంటీవీ కథనం స్పందనగా NHAI అధికారులు డివైడర్లకు రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేశారు.

MANIKANTA, TUNI
Published on: 29 July 2026 11:06 PM IST
Tuni
X

Tuni: తుని నేషనల్ హైవేపై NHAI అధికారుల యాక్షన్ ప్లాన్!

తుని: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, డివైడర్ల వల్ల జరుగుతున్న ప్రాణనష్టంపై ప్రయాణికులు, స్థానికులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటూ... ‘హెచ్‌ఎంటీవీ’ ప్రసారం చేసిన వరుస కథనాలకు అధికారులు ఎట్టకేలకు స్పందించారు.

​ఈ మార్గంలో రాత్రి సమయాల్లో డివైడర్లు సరిగ్గా కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ‘హెచ్‌ఎంటీవీ’ ఇటీవల సమగ్ర కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి తక్షణమే స్పందించిన నేషనల్ హైవే అథారిటీ (NHAI) అధికారులు మరియు టోల్ మేనేజ్‌మెంట్ వర్గాలు, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాయి.

​ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న తుని బైపాస్ (పాయకరావుపేట పరిసర ప్రాంతాలు, ఛైనేజ్ నంబర్ 809/750 LHS) ప్రాంతంలో హై-క్వాలిటీ రేడియం స్టిక్కర్స్ (Reflective Stickers) మరియు స్పష్టమైన హెచ్చరిక బోర్డులను అమర్చారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు డివైడర్లు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను సరికొత్తగా ఏర్పాటు చేసినట్లు టోల్ మేనేజర్లు వెల్లడించారు.

​‘హెచ్‌ఎంటీవీ’ కథనం ద్వారా సమస్య వెలుగులోకి రావడంతో, సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిరంతర పర్యవేక్షణ, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ మరింత కఠినతరం చేస్తే ప్రయాణికుల ప్రాణాలకు పూర్తి భద్రత చేకూరుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story